Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోండి..

ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోండి..

- Advertisement -

రోటి క్లబ్ అధ్యక్షులు నాగభూషణ
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 14వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించబడే ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, మాజీ రోటరీ క్లబ్ అధ్యక్షులు, సాంస్కృతిక మండలి అధ్యక్షులు సత్రశాల ప్రసన్నకుమార్, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ రత్నశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు సాంస్కృతిక మండలి లో శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా క్లబ్ యొక్క లక్ష్యం అని వారు తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళలలో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. ఉచిత వైద్య చికిత్సలు, ఉచిత ఆపరేషన్, ఉచిత రవాణా ఖర్చు, ఉచిత అద్దాలు కూడా పంపిణీ చేయబడునని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కోరా రామసుబ్బారెడ్డి తమ్ముడు కోరా రామిరెడ్డి వారి కుటుంబ సభ్యులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. కంటి పరీక్షలు చేయించుకునే వారు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు లేదా హోటల్ గుర్తింపు కార్డుతో రెండు జిరాక్స్ కాపీలు ఫోటోలు ఫోన్ నెంబరు వెంట తీసుకొని రావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ గ్రామీణ ప్రాంత పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని కంటి వెలుగును ప్రసాదించుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు