Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా బీజేపీ నాయకులు కట్టించిన ఫ్లెక్సీలు రాజ్యాంగానికే అవమానం

అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా బీజేపీ నాయకులు కట్టించిన ఫ్లెక్సీలు రాజ్యాంగానికే అవమానం

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం; ధర్మవరంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా బీజేపీ నాయకులు కట్టించిన ఫ్లెక్సీలు రాజ్యాంగానికే అవమానం అని బీఎస్పీ ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికార పార్టీనే అవమానకర చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యంపై దాడి అని పేర్కొన్నారు. ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ కాన్వాయ్ అదే మార్గంలో వెళ్తూ ఈ అవమానాన్ని చూడకపోవడం బాధ్యతారాహిత్యమని ప్రశ్నించారు. వాజ్పేయి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వచ్చిన బీజేపీ–టీడీపీ–జనసేన నేతలు పక్కనే ఉన్న కనకదాసు, గాంధీ, అబ్దుల్ కలాం, అంబేద్కర్ విగ్రహాలకు కనీసం పూలమాలలు కూడా వేయకపోవడం వారి అసలు మనస్తత్వాన్ని బయటపెడుతుందని ఆయన ఆక్షేపించారు. దళిత ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు అదే కాన్వాయ్‌లో ఉండి కూడా ఈ అవమానంపై ఒక్క మాట మాట్లాడకపోవడం విచారకరం అని తెలిపారు. 69వ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సీఎం, మాజీ సీఎంలు నివాళులు అర్పించకపోవడం కూడా దళితుల గౌరవాన్ని పట్టించుకోని రాజకీయాల నిదర్శనం అని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ విగ్రహం ముందు ఉన్న ఫ్లెక్సీలను బీజేపీ వెంటనే తొలగించాలి, లేనిపక్షంలో ప్రజలతో కలిసి మేమే తొలగిస్తామని సాకే వినయ్ కుమార్ హెచ్చరిస్తూ రాజ్యాధికారం మనకు రావాలంటే మనమందరం ఒక్కటిగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎమ్మార్పీఎస్ వెంకటేష్, ఎనమల నరేష్, కాంగ్రెస్ ధర్మవ రం ఇంచార్జ్ , ప్రజా సంఘాలు విద్యావేత్తలు సామాజికవేత్తలు దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు