Homeజిల్లాలుఅనంతపురంధర్మవరంలో సోకిన స్క్రబ్ టైఫస్ వ్యాధి..

ధర్మవరంలో సోకిన స్క్రబ్ టైఫస్ వ్యాధి..

- Advertisement -

కోలుకుంటున్నా వృద్ధురాలు చౌడమ్మ
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణంలో స్క్రబ్ టైఫన్ వ్యాధి శాంతినగర్కు చెందిన 78 సంవత్సరాల చౌడమ్మకు సోకిందని ప్రభుత్వాసుపత్రి సూపర్డెంట్ జితేంద్రనాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌడమ్మ ఈనెల నాలుగవ తేదీ జ్వరము వాంతులు కాళ్లు నొప్పులతో ప్రభుత్వాసుపత్రికి చేరిందని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిషన్ చేసిన తర్వాత ఓ అనుమానంతో ఈ నెల 8వ తేదీ రాపిడ్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. తదుపరి ఆ టెస్ట్ వివరాలను అనంతపురం మెడికల్ కళాశాల కు షాంపులుగా పంపడం జరిగిందన్నారు. తరువాత పదవ తేదీ పాజిటివ్లో స్క్రబ్ టైఫాన్ వ్యాధిగా గుర్తించడం జరిగిందన్నారు. అనంతరం జిల్లా అధికారులు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం చౌడమ్మకు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని, ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ వ్యాధి పై అవగాహనను ప్రజలకు తెలియజేస్తామని, ఈ వ్యాధి ఒక చిగ్గర్ అనే చిన్న పురుగు కాటువల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అవుతుందన్నారు. ఇది సాధారణంగా పొలాలు గడ్డి పొదలు, పశువుల కాటిల్ల వంటి ప్రాంతాలలో అధికంగా ఉంటుందని తెలిపారు. కాటు వేసిన చోట నల్ల మచ్చ ఏర్పడుతుందని, దీనివల్ల తీవ్ర జ్వరం వస్తుందని తెలిపారు. ఐదు రోజుల కంటే ఎక్కువ జ్వరం రావడం శరీరంపై నల్ల మచ్చ రావడం తలనొప్పి శరీర నొప్పులు శ్వాసలో ఇబ్బంది బలహీనత లాంటివి లక్షణాలు అని తెలిపారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందించుకోవాలని తెలిపారు.డాక్టర్ ఇచ్చే డాక్సీసైక్లిన్ లేదా అజీథ్రోమైసిన్ మందులతో పూర్తిగా నయం అవుతుంది అని తెలిపారు.
జ్వరం ఎక్కువ రోజులు ఉన్నవారు తక్షణం వైద్యుని సంప్రదించాలి అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు