విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర, శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పదవ తరగతి చదువుతున్న బాల బాలికలకు 2087 మందికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చేతుల మీదుగా తొలుత వెయ్యి మందికి పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం విద్యకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, విద్యార్థులు తల్లిదండ్రులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తమ ఇంటి నుంచి బడికి రావాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారన్న కష్టం తోనే తాను ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, డీఈవో కిష్టప్ప, ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్, రాష్ట్ర, జిల్లాబిజెపి నాయకులు, ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పదవ తరగతి విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ
- Advertisement -
RELATED ARTICLES


