Homeజిల్లాలుతూర్పు గోదావరిభవన నిర్మాణకార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి పథకాలు

భవన నిర్మాణకార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి పథకాలు

- Advertisement -

విశాలాంధ్ర – నిడదవోలు : భవన నిర్మాణకార్మికులకు సంక్షేమ బోర్డు నుంచి పథకాల అమలును పునరుద్ధరించా లని ప్రభుత్వం నిర్ణయించటం పట్ల నిడదవోలు బిల్డింగ్ పెయింటర్స్,ఆర్టిస్టుల సంఘం హర్షం వ్యక్తం చేసింది ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు జువ్వలరాంబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం 2020సెప్టెంబర్ 7వ తేదీ నుంచి పెండింగ్ లో ఉన్న క్లైములు అన్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 2020లో సెప్టెంబర్ 7వ తేదీన మెమో 1.214తో సంక్షేమ పథకాలు అమలు చెయ్యకుండా నిలిపి వేసిందన్నారు. కార్మిక సంఘాలు చేసిన పోరాటాల ఫలితమే బోర్డు పునరుద్ధరణ అని అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసిందని జిల్లా కలెక్టరేట్లూ, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద, కార్మిక శాఖ కార్యాలయాలు వద్ద, కార్యక్రమాలు నిర్వహించిన పోరాటఫలితమే బోర్డు పునరుద్ధరణ అని కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డు పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు పునరుద్ధరణలో ప్రసూతి కి రూ 20వేలు పిల్లల పెళ్లికి 40వేలు సహజ మరణానికి 60వేలు అంత్యక్రియలకు 20వేలు కార్మికులకు ఆరోగ్య పరీక్షలు కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో గండి శ్రీనివాసరావు, యు. ప్రభాకర్ రావు, గుమ్మడి రమేష్, టీ ఫ్రాన్సిస్ రాజు, ఎ. సత్యానందం,, జీ నేతాజీ,, బీ. సురేష్, టీ. దీపు, డీ. వినోద్, పండు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు