–12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం: డి.ఎస్.పి హేమంత్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం: దొంగతనాలు చేసిన ద్విచక్ర వాహనాలను తక్కువ ధరకు అమ్మి, సొమ్ము చేసుకుంటున్న దొంగలను టూటౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా టూటౌన్ పోలీస్ స్టేషన్లో డిఎస్పీ హేమంత్ కుమార్, టూ టౌన్ సిఐ రెడ్డప్ప విలేకరులతో మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు తక్కువ ధరకు ఇప్పిస్తామని ఈ దొంగలు దొంగతనం చేసిన వాహనాలను అమ్మేవారిని తెలిపారు. ఇద్దరూ బైక్ దొంగలను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలకు ఏ కంపెనీకి సంబంధించిన ద్విచక్ర వాహనమైన (దొంగతనం చేసిన బైకులు) మరి ఆర్డర్ చేసుకొని తక్కువ ధరకే అమ్మేవారిని తెలిపారు. తొలుత ఈ దొంగలు ఆర్డర్లు తీసుకొని, దొంగ ద్విచక్ర వాహనాలను దర్జాగా విక్రయించే వారిని తెలిపారు. ధర్మవరం పట్టణముతో పాటు హిందూపురం, అనంతపురం, తాడిమర్రి పోలీస్ స్టేషన్లలో కూడా ఈ దొంగలపై కేసులు ఉన్నాయని తెలిపారు. డి.ఎస్.పి ఆదేశాల మేరకు టూ టౌన్ సిఐ రెడ్డప్ప ప్రత్యేక బృందము తో పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. దొంగతనం చేసిన వారిలో ధర్మవరం ఇందిరానగర్కు చెందిన సాకే మల్లికార్జున, ముదిగుబ్బ మండలానికి చెందిన మద్దినేని నాగరాజు లను గుర్తించి, విచారించగా దొంగతనమును ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. మరో ప్రధాన నిందితుడు అనంతబాబు పరారీలో ఉన్నాడని, త్వరలో అతనిని కూడా అరెస్టు చేసి జైలుకు పంపుతామని తెలిపారు. ఈ దొంగలు ఇంకా ఎన్ని వాహనాలను చోరీ చేసినది అన్న విషయాలను మరింత విచారణ చేసి బట్టబయలు చేస్తామని తెలిపారు. వాహనదారులు కూడా వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు పత్రాలు లేకుండా వాహనాలను అమ్మేందుకు ప్రయత్నించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. నెంబర్ ప్లేటు లేని వాహనాలు కొన్న, లేదా విక్రయించిన, ఇరువురి మీద కేసులు నమోదు చేస్తామని వారు తెలిపారు. బైకు దొంగలను అరెస్టు చేయడంలో మంచి ప్రతిభ ఘనపరిచిన టూటౌన్ సిఐ రెడ్డప్పను, ఏఎస్ఐ డోనా సింగ్ ను, పోలీస్ సిబ్బందిని డిఎస్పి అభినందించారు.


