–శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం: రోగులకు చేసే సేవ దైవ సేవతో సమానం శ్రీ సత్య సాయి సేవ సమితి-2 పిఆర్టి సర్కిల్-నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 220 మంది రోగులకు పాలు ,బ్రెడ్లు ,బిస్కెట్లు, సిస్టర్లు చేతిమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా పొలమడసుబ్రహ్మణ్యం, పోలమడరాగిణి దంపతులు, చౌటుపల్లి భాగ్యమ్మ నిర్వహించినందుకు సమితి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. పుట్టపర్తి సాయిబాబా ఆశీస్సులు మేరకు ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నందుకు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. దాతల సహాయ సహకారములతోనే ఈ కార్యక్రమ నిర్వహణ జరుగుతున్నదని వారు తెలిపారు. అనంతరము ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సమితి వారు నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలకు దాతలు కూడా ముందుకు రావాలని తెలుపుతూ, మానవతా విలువలు పెంపొందింప చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
రోగులకు సేవ దైవ సేవతో సమానం
- Advertisement -
RELATED ARTICLES


