Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమడకశిరలో దామోదరం సంజీవయ్య విగ్రహం

మడకశిరలో దామోదరం సంజీవయ్య విగ్రహం

- Advertisement -

మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు జూటూరు మహేంద్ర

విశాలాంధ్ర ధర్మవరం:శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర పట్టణం నందు మొట్టమొదటిసారిగా మొట్టమొదటి దళిత (మాల )ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలకు ఆధ్యుడు దళితుల ఉన్నతికి పాటుపడిన స్వర్గీయ దామోదరం సంజీవయ్య విగ్రహ ఏర్పాటు కమిటీ, మరియు మాల మహానాడు మడకశిర తాలూకా వారిచే ఫిబ్రవరి 14 . శనివారం 2026న దామోదరం సంజీవయ్య కాంస్య విగ్రహ ప్రతిష్ట నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ధర్మవరం గుట్ట కింద పల్లి లోని మన ఆత్మీయ మాల కులస్తులందరినీ పేరుపేరునా పలకరించి సంజీవయ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలతో కూడిన కరపత్రంను విడుదల చేశారు.గ్రామంలో ఉన్న మాల కులస్థులందరూ కూడా మడకశిర లోని విగ్రహ ఏర్పాటు కమిటీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలియజేశారు.మన మాల జాతి ఐక్యత కోసం ధర్మవరంలో ఉన్న మాల బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అనంతపురం సత్యసాయి జిల్లాల మాల మహానాడు జిల్లా అధ్యక్షులు సుగుమంచి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఉరుములు రాము, రాప్తాటి నియోజకవర్గం అధ్యక్షులు విజయకుమార్, నారాయణస్వామి, ప్రసాద్, రామ్మోహన్, పరశురాముడు, బాలు, మద్దిల గంగాధర్ ఆదిశేషు, సోము, కేశమ్మ , ముసలక్క తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు