- Advertisement -
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని రాజేంద్రనగర్ లో నిర్మిస్తున్న శ్రీ శ్వేతార్క వరాల వరసిద్ధి వినాయక దేవస్థానమునకు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సంధరాఘవ 50 వేల రూపాయల నగదును ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ నిర్మాణము కొరకు తనవంతుగా ఈ విరాళమును అందజేసినట్లు సంద రాఘవ తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ వారు సంధ రాఘవా కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.


