Homeఆంధ్రప్రదేశ్తీరం దాటిన 'అక్వాన్‌' తీవ్ర తుపాను.. ఉత్తరాంధ్రలో వర్షాలు

తీరం దాటిన ‘అక్వాన్‌’ తీవ్ర తుపాను.. ఉత్తరాంధ్రలో వర్షాలు

- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్‌ తీవ్ర తుపాను తీరం దాటింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌ సమీపంలో తుపాను తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయని తెలిపారు. కొన్ని సందర్భాల్లో గాలి వేగం గంటకు 90 కిలోమీటర్లకు చేరినట్లు పేర్కొన్నారు.
శ్రీకాకుళంలో భారీ వర్షాలు
అక్వాన్‌ తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంచిలి, కవిటి ప్రాంతాల్లో చెరో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సోంపేటలో 9.2 సెంటీమీటర్లు, పలాసలో 9.9 సెంటీమీటర్లు, వజ్రపుకొత్తూరులో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు