కూల్ డ్రింక్స్ పేరుతో విషాన్ని అమ్ముతున్నాయని కంపెనీలపై ఫైర్
పతంజలి రోజ్ షర్బత్ ప్రమోషన్ చేస్తూ రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు
యోగ గురువు రాందేవ్ బాబా తాజాగా కూల్ డ్రింక్ కంపెనీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్కెట్లో కూల్ డ్రింక్ ల పేరుతో విషాన్ని అమ్ముతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కూల్ డ్రింక్స్ కంపెనీలు షర్బత్ జిహాద్ కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. జనాలకు విషాన్ని అమ్ముతూ వచ్చిన సొమ్ముతో మసీదులు, మదర్సాలు కడుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. కూల్ డ్రింక్ తో మీ శరీరంలోకి విషం చేరడంతో పాటు మీ జేబులోని డబ్బు మసీదులు, మదర్సాల నిర్మాణానికి వెళుతోంది అని రాందేవ్ బాబా హెచ్చరించారు. పతంజలి సంస్థ నుంచి తీసుకొచ్చిన రోజ్ షర్బత్ ప్రమోషన్ కోసం చేసిన వీడియోలో రాందేవ్ బాబా ఈ ఆరోపణలు చేశారు. ఇది షర్బత్ జిహాద్.. కూల్‌డ్రింక్స్ పేరుతో కంపెనీలు అమ్ముతున్న మరుగుదొడ్లను శుభ్రం చేసే విషం నుంచి మీ కుటుంబాన్ని కాపాడండి. పతంజలి షర్బత్, జ్యూస్‌లను మాత్రమే ఇంటికి తీసుకెళ్లండి. ఈ షర్బత్ మీ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు మీ డబ్బును గురుకులాలు, పతంజలి యూనివర్సిటీ నిర్మాణానికి ఉపయోగపడుతుంది అంటూ రాందేవ్ బాబా వీడియోలో సూచించారు.
షర్బత్ జిహాద్.. రాందేవ్ బాబా సంచలన ఆరోపణలు…
RELATED ARTICLES