Homeఅంతర్జాతీయంహర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు

హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు

- Advertisement -

ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారియి. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనితో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత పలు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. గ్రీక్‌కు చెందిన బల్క్ క్యారియర్ ఃఎన్‌జే ఎర్త్ః, లైబీరియా జెండా కలిగిన ఃడేటోనా బీచ్ః అనే రెండు నౌకలు ఈ జలసంధిని దాటాయి. అదే సమయంలో ఃఏయూఆర్‌ఓయూఆర్ఏః నౌక ఈ జలసంధిని దాటేందుకు సిద్ధమైన సమయంలో ఉద్రిక్తతలు తిరిగి చోటు చేసుకున్నాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 250 మందికి పైగా మృతి చెందారు. దీనితో ఇరాన్ హర్మూజ్‌ను మూసివేసింది. దీనితో ముసందమ్ తీరం సమీపంలో ఈ నౌక వెనక్కి మళ్లింది. హర్మూజ్‌ను దాటేందుకు సిద్ధమైన మరిన్ని నౌకలు కూడా వెనుదిరిగినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు