Homeజిల్లాలుఅనంతపురంకుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎస్పీ జగదీష్ ఆకస్మిక తనిఖీ

కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎస్పీ జగదీష్ ఆకస్మిక తనిఖీ

- Advertisement -

భక్తుల భద్రతే లక్ష్యం.. అధికారులకు ఎస్పీ కీలక ఆదేశాలు……

గూగూడు ఉత్సవాలపై జిల్లా ఎస్పీ ప్రత్యేక సమీక్ష

విశాలాంధ్ర – నార్పల: – మండల పరిధిలోని గూగూడు గ్రామంలో జరుగుతున్న శ్రీ కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్, ఐపీఎస్ మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఈవో, ఆలయ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో సమావేశమై ఉత్సవాల నిర్వహణ, భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సౌకర్యాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జేబుదొంగలు, చైన్ స్నాచర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టడంతో పాటు అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని తెలిపారు.
మహిళలు, వృద్ధులు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు పోలీసు సిబ్బందిని నియమించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఉత్సవాలు ముగిసే వరకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ భక్తులకు భద్రత కల్పించాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఆలయ ఈవో, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు