Homeఆంధ్రప్రదేశ్రైతులకు నాణ్యమైన విత్తన కాయలను పంపిణీ చేయండి..

రైతులకు నాణ్యమైన విత్తన కాయలను పంపిణీ చేయండి..

- Advertisement -

ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ;; రైతులకు నాణ్యమైన విత్తన కాయలను పంపిణీ చేయాలని ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఖరీఫ్ సీజన్ పంట సాగు నిమిత్తం ప్రభుత్వం రైతులకు సరఫరా చేస్తున్న సబ్సిడీ వేరుశనగ కాయలను సిపిఐ పార్టీ నాయకులు మంగళవారం పరిశీలించారు.ఈ నేపథ్యంలో వారు మండలంలోని రామస్వామి నాయక్ తాండ గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో నిల్వ ఉంచిన వేరుశనగ కాయలను పరిశీలించి అది పూర్తిగా నాశరకంగా ఉన్నాయని గుర్తించారు, ఈ మేరకు సిపిఐ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఏ ప్రభుత్వం వచ్చినా తరచూ నాశరకం కాయలనే సరఫరా చేస్తూ
రైతులను నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా లోనే పెద్ద మండలంగా పేరుగాంచి దాదాపు 19 రైతు సేవా కేంద్రాలు ఉన్న ఈ మండలంలో ఇప్పటివరకు కేవలం మూడు కేంద్రాలకు మాత్రమే విత్తనాలను సరఫరా చేసి, మిగతా కేంద్రాలకు నేటికీ సరఫరా చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని గ్రామాల రైతన్నలకు సకాలంలో విత్తనం కాయలు లభించకపోవడంతో అదును దాటిపోతోందని భయంతో వారు గత్యంతరం లేక అధిక ధరలు వెచ్చించి, బయట మార్కెట్లో కొనుగోలు చేసి పంట సాగు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనుక ఇప్పటికైనా తక్షణమే మండల రైతుల డిమాండ్ను బట్టి మండలానికి తగినంత మేర కాయలను కేటాయించడమే గాక నాణ్యమైన విత్తనాల్ని రైతులకు పంపిణీ చేయాలన్నారు. లేనిపక్షంలో త్వరలోనే మండల రైతులతో కలిసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సహాయ కార్యదర్శులు తిప్పయ్య, ఈశ్వర నాయక్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు