Sunday, November 16, 2025
Homeజిల్లాలుఏలూరుదివ్యాంగులకు ప్రత్యేక బోధన

దివ్యాంగులకు ప్రత్యేక బోధన

- Advertisement -

అనిత
విశాలాంధ్ర – చాట్రాయి : అంగవైకల్యం కలిగిన పిల్లలకు ప్రత్యేక విద్యాబాధన ఎంతగానో దోహదం చేస్తుందని చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయురాలు అనిత తెలిపారు. శనివారం సాయంత్రం ఆమె విశాలాంధ్రతో మాట్లాడుతూ. మండల కేంద్రమైన చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంగవైకల్యం కలిగిన పిల్లలకు ఫిజియోథెరపీ ,నోట్ స్పీచ్, మరియు విద్యాబోధన అందించడమే కాకుండా ప్రభుత్వం నుండి అందే ఉపకార వేతనాలను గుర్తింపు కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మానవతా దృక్పథంతో వికలాంగులకు అండదండగా నిలుస్తూ వారి పురోభివృద్ధికి విధ్యాబివృద్దికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు