Sunday, November 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు

ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మండల స్థాయి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంఈఓ గోపాల్ నాయక్, జడ్పీ గర్ల్స్ హై స్కూల్ హెడ్మాస్టర్ సుమన, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెస్సు, వాలీబాల్, బ్యాట్మింట, కోకో, కబడ్డీ, యోగాలలో అండర్ 14, 17. బాలికల, బాలుర విభాగాలలో ఎంపిక టోర్నమెంటును నిర్వహించి అన్ని విభాగాలలో మండల చెట్లు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్జీఎఫ్ కోఆర్డినేటర్స్ స్వరూప, సరళ, ఫిజికల్ డైరెక్టర్లు ఓబులేసు, రఘునాథరావు, రమేష్ బాబు, నాగేంద్ర, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు