Sunday, November 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది.. కన్వీనర్ నామా ప్రసాద్

రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది.. కన్వీనర్ నామా ప్రసాద్

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం ; రోగులకు సేవ చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి గాంధీ నగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ లను పంపిణీ చేశామని తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఈ సేవా కార్యక్రమానికి శ్రీ సత్య సాయి సేవ సమితి వారు నిర్వహించడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమానికి దాతలు కూడా ముందుకు రావాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్ర నాయక్ మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి చేస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తి దాతలు అవుతారని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు రోగులకు వరం లాగా మారాయని తెలిపారు. దాతలుగా రాబోవు వారు సెల్ నెంబర్ 9966047044 కు గాని 903044065కు గాని సంప్రదించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు