సూపరిండెంట్ తిప్పేంద్ర నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రికి మంజూరైన నిధులతో ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరుస్తాము అని సూపర్డెంట్ తిప్పేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. తొలుత కమిటీ సభ్యులతో ఆసుపత్రిలోని పలు వార్డులను, రోగులతో మాటలు తదితర వాటిని వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగుల సౌకర్యార్థం అవసరమైన పరికరాల కొనుగోలుకు 63 లక్షల నిధులతో పనులు చేపడతామని తెలిపారు. ఎందుకు కమిటీ కూడా తీర్మానం చేసి ఆమోదించడం జరిగిందని తెలిపారు. రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అందరి కృషి ఎంతో అవసరమని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై కూడా చర్చించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం డి హెచ్ ఓ చెన్నారెడ్డి, డాక్టర్ నరసింహులు, డాక్టర్ సోనియా, మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణ, ఏవో. ఉదయభాస్కర్, సీనియర్ అసిస్టెంట్ నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
నిధులతో ప్రభుత్వ ఆసుపత్రిని మరింత అభివృద్ధి పరుస్తాం..
- Advertisement -
RELATED ARTICLES


