విశాలాంధ్ర- ధర్మవరం; ఈనెల 20వ తేదీన నిర్వహించుకునే దీపావళి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు టపాసుల విక్రయదారులతో ఆర్డిఓ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహిస్తూ, పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టపాసుల విక్రయదారులు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని వారు హెచ్చరించారు. ప్రమాదాలు జరగకుండా బాధ్యతతో దుకాణా దారులు మెలగాలని వారు సూచించారు. మరో మూడు రోజుల్లో దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను పరిశీలించి షాపులకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్తు, అగ్నిమాపక, కమీషనర్ అధికారుల వద్ద తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. పండుగ ముగిసేంతవరకు అగ్నిమాపక వాహనము సిబ్బంది క్రీడా మైదానంలోనే ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది కూడా ఉంటారని తెలిపారు. అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు ఇవ్వరాదని వారు మరోసారి సూచించారు.
క్రీడా మైదానాన్ని పరిశీలించిన ఆర్డీవో మహేష్..
పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో దీపావళి పండుగ సందర్భంగా అక్కడ నిర్మాణం అవుతున్న చెట్లను ఆర్డిఓ మహేష్ ఆకస్వికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టపాసులు నిల్వచేసే, లేదా విక్రయించే వాటికి చక్కటి షెడ్లను వేసుకోవాలని, అగ్నిమాపక, విద్యుత్ అధికారులు, మున్సిపల్ ఆఫీస్ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ప్రతి దుకాణము వద్ద ఇసుక నీరు మట్టి తప్పనిసరి ఉండాలని తెలిపారు. దుకాణం కొరకు దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా చలానా తో పాటు జీఎస్టీ కూడా తప్పక చెల్లించాలని తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ ప్రభుత్వ అధికారులు ప్రత్యేక శ్రద్ధలు కనపరచాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తో పాటు ఎమ్మార్వో సురేష్ బాబు కమిషనర్ సాయి కృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


