విశాలాంధ్ర ధర్మవరం;; ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహకారంతో నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉద్యోగ కల్పనలో భాగంగా స్కిల్ హబ్ నందు యునానిటీ ఫౌండేషన్ నుంచి యుఎన్ఎస్టి ప్రోగ్రాములు నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యమును మెరుగుపరచడమే ఉన్నత లక్ష్యము అని నెలరోజులు పాటు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ పి ఓ సి బాల జోషి, ఏపీ స్టేట్ సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిబ్బంది, ఉన్నతి ఫౌండేషన్ సిబ్బంది, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
నిరుద్యోగ యువతకు శిక్షణ.. ప్రిన్సిపాల్ సురేష్ బాబు
- Advertisement -
RELATED ARTICLES


