విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఆర్డిట గ్రౌండ్ లో u-12 బాలుర మండల స్థాయి టోర్నమెంట్ లో భాగంగా ఎంసీఏ గొట్లూరు ,బత్తలపల్లి జట్ల మ్యాచ్ ని ధర్మవరం వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గుండ్లపల్లి ధనుంజయ్ , సభ్యులు మురళి, రాక్‌స్టార్ ఫ్యాషన్స్ శివ, ఆస్ట్రో హరి టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం క్రికెట్ కోచ్ రాజశేఖర్ మాట్లాడుతూటాస్ గెలిచిన బత్తలపల్లి జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. బత్తలపల్లి జట్టు 16.5 ఓవర్లలో 71/10 పరుగులు చేసింది అని, గొట్లూరు జట్టు ఆటగాడు ఎస్ సాథ్విక్ 3 వికెట్లు, పరశురామ దత్త 2 వికెట్లు తీశారు అని తెలిపారు. ఎంసీఏ గొట్లూరు జట్టు 14.2 ఓవర్లలో 74/3 పరుగులు చేసింది అని తెలిపారు. గొట్లూరు బ్యాటర్ పరుశురామ్ దత్త 26 పరుగులు చేశాడు. ఎంసీఏగొట్లూరు జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది అని తెలిపారు.రెండవ మ్యాచ్ లో ఆర్డీటీ ధర్మవరం, ఫ్యూచర్ స్టార్స్ ధర్మవరం మధ్య రెండో మ్యాచ్ జరిగింది అని,టాస్ గెలిచిన ఆర్డీటీ ధర్మవరం జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది అన్నారు. ఆడిటి ధర్మవరం 20 ఓవర్లలో 269/3 స్కోరు చేసింది అన్నారు. ఆర్డీటీ ధర్మవరం బ్యాటింగ్‌లో బద్రీనాథ్ 22 బంతుల్లో 59, మణికంఠ 30 బంతుల్లో 57, గోవర్ధన్ 18 బంతుల్లో 52 పరుగులు చేశారు అని తెలిపారు. ఫ్యూచర్ స్టార్స్ ధర్మవరం జట్టు 13 ఓవర్లలో 54 పరుగులకే ఆలౌట్ అయిందన్నారు. ఆర్డీటీ ధర్మవరం జట్టు బౌలర్లు రాజా 4 వికెట్లు, పూజారి విక్రమ్ 3 వికెట్లు, ఎన్ సిద్ధార్థ్ 2 వికెట్లు పడగొట్టారు అని తెలిపారు. అనంతరం విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఘనంగా శ్రీనివాసులు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్
- Advertisement -
RELATED ARTICLES


