జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రజలకు అందించే రెవెన్యూ సేవలు సకాలంలో, పారదర్శకంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ధర్మవరం ఆర్డీవో కార్యాలయ సమావేశ హాలులో ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సమావేశంలో పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్స్, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, రీ-సర్వే, జాయింట్ ఎల్పీఎంల అమలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. తదుపరి
జేసి మాట్లాడుతూ రీసర్వే పూర్తయిన గ్రామాలలో ఫిబ్రవరి 2 నుంచి 9 వరకు చేపట్టనున్న నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీని పక్కగా నిర్వహించాలన్నారు. పౌర సరఫరాల నిత్యవసర వస్తువుల పంపిణీ, దీపం గ్యాస్ పథకం అమలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు సమర్థవంతంగా చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పిజిఆర్ఎస్ ప్రతి దరఖాస్తును గడువులోగా పరిష్కరించి ప్రజలకు నమ్మకం కలిగించేలా పనిచేయాలని ఆదేశించారు. అనంతరం వివిధ అంశాలలో సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు.ఈ సమావేశంలో డిఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీవో మహేష్, సర్వే శాఖ ఏడి విజయశాంతి, డీఎస్ఓ వంశీకృష్ణ రెడ్డి, తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దారులు, సర్వే, పౌర సరఫరాల శాఖ అధికారులు, వీఆర్వోలు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలే లక్ష్యం
- Advertisement -
RELATED ARTICLES


