సిఐటియు, రైతు సంఘం, చేనేత కార్మిక సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోళ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక గాంధీనగర్ సర్కిల్ నందు సిఐటియు, రైతు సంఘం, చేనేత కార్మిక సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భోగి మంటల్లో జీవో పత్రుల దగ్ధం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ లో కార్మికులకు, ఉద్యోగులకు, నష్టం వాటిల్లే విధంగా పనిగంటలను పెంచి కార్మికుల హక్కులను హరించడం దారుణం అన్నారు.అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మారుస్తూ విబిజి రాంజీ అనే పేరుతో, కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లు తీసుకుని రావడం సమంజసం కాదన్నారు.రైతులకు, కార్మికులకు నష్టం కలిగించే విధంగా జీవోలను తీసుకొని రావడంతో, ఆ యొక్క జీవో పత్రులను, భోగిమంటల్లో కాల్చి నిరసన వ్యక్తం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడానికి సంవత్సరానికి 200 రోజులు పని దినాలు, రోజు కూలి 600 రూపాయల సాధన కోసం, గ్రామీణ/మరియు ప్రాంత వ్యవసాయ మరియు ఉపాధి కూలీలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
రైతుసంఘం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి జంగాలపల్లిపెద్దన్న, సిఐటియు సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష, జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు అయూబ్ ఖాన్, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి శేషంపల్లి మారుతి, సిఐటియు నాయకులు అది నారాయణ షేక్షావలి, అంగన్వాడి నాయకురాలు అరుణ, చేనేత కార్మికులు, వెంకటస్వామి,సన్నప్పయ్య, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి
- Advertisement -
RELATED ARTICLES


