దేవతా వెంకట నాగరాజు
విశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులకు చిన్న తరము నుంచే ఇతిహాసాలను అభ్యసింపజేయాలని శ్రీ గీతా భక్తమండలి సభ్యుడు దేవత వేంకట నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా గీత భక్తమండలి ఆధ్వర్యంలో పట్టణంలోని కళాజ్యోతి వారి సౌజన్యంతో శ్రీ పోతన భాగవతం పై క్విజ్ పోటీలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పోటీలో 25 మంది పాల్గొనడం జరిగిందని, ఇందులో నలుగురు మాత్రమే వారి ప్రతిభను చాటి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రశ్నలకు సమాధానములు ఇవ్వడంలో కె. అర్పిత, కే .సాయి వాసవి, కే.జాహ్నవి, ఆర్. భవ్య శ్రీ లకు నగదు బహుమతులను అందజేశారు. మొత్తం పది పది ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థుల ద్వారా రాబట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాజ్యోతి అధ్యక్షులు నారాయణప్ప, కార్యదర్శి రామకృష్ణ, దేవతా కృష్ణమూర్తి సింగనమల రామకృష్ణ, పిన్ను రామకృష్ణ హరిప్రసాద్ శివ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చిన్నతనం నుంచే ఇతిహాసాలను అభ్యసింప చేయాలి..
- Advertisement -
RELATED ARTICLES


