విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని రిషి విద్యాలయ విద్యార్థి గ్రేడ్–7 విద్యార్థిని సిరి మహారాష్ట్రలోని షోలాపూర్‌లో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొంటోంది అని పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సిరి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.
ప్రిన్సిపాల్ కరన్ స్వరూప సింగ్ మాట్లాడుతూ, సిరి ఈ పోటీల్లో మంచి ప్రదర్శనతో పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సీఈవో
రవీంద్ర మాట్లాడుతూ, సిరి క్రమశిక్షణతో సాధన చేస్తూ ఈ స్థాయికి చేరుకోవడం అభినందనీయమని, జాతీయ స్థాయిలో విజయం సాధించాలని ఆకాంక్షించారు.
అలాగే ఏవో రంగారెడ్డి వైస్ ప్రిన్సిపల్ కళ్యాణి ఉపాధ్యాయులు విద్యార్థులంతా సిరికి “ఆల్ ది బెస్ట్” చెబుతూ విజయాన్ని కోరారు
జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొంటున్న రిషి విద్యాలయ విద్యార్థిని
- Advertisement -
RELATED ARTICLES


