Wednesday, January 14, 2026
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లావిద్యార్థులు క్రమశిక్షణతో చదువును అభ్యసించాలి…

విద్యార్థులు క్రమశిక్షణతో చదువును అభ్యసించాలి…

- Advertisement -

విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

విశాలాంధ్ర నందిగామ :-విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్థానిక శాసన సభ్యురాలు,ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు శుక్రవారం రైతుపేటలోని శ్రీ గౌతమ హైస్కూల్లో 5వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తల్లి మొదటి గురువు అని ఆ తర్వాత విద్యార్థుల బాధ్యత గురువులైన అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన క్రమశిక్షణ కలిగిన విద్యను అందించాలని ఆమె సూచించారు ఉపాధ్యాయులు నేర్పిన పాఠ్యాంశాలను చక్కగా అవగాహన చేసుకుని ప్రధమ శ్రేణిలో ఉత్తీర్లవ్వాలని విద్యార్థినీ విద్యార్థులకు ఆమె సూచించారు నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదుగుతారని అన్నారు అనేక ఉత్తమ ఉద్యోగాలలో యువత రాణించాలని సూచించారు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే యువతగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృత కార్యక్రమా లు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మండల వరలక్ష్మి తో పాటు పాఠశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ పని సాయి అఖిల్,డైరెక్టర్ సరికొండ రవీంద్రబాబు,లక్ష్మి మరియు డైరెక్టర్లు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు