యువర్ ఫౌండేషన్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు అన్నదానం చేయడం దైవ సేవతో సమానమని యువర్ ఫౌండేషన్ సంస్థ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు దాదాపు 500 మందికి అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దాతగా పుల్లయ్య వారి కోడలు రాధాదేవి వ్యవహరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఇందులో భాగంగానే యువర్ ఫౌండేషన్ సంస్థ ఎన్నో రకాలుగా సేవలను అందిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్నామని వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిప్పేంద్ర నాయక్ మాట్లాడుతూ యువర్ ఫౌండేషన్ సంస్థ ఆసుపత్రిలోనే కాకుండా విద్యార్థులకు, వృద్ధులకు, పేదలకు సేవలు చేయడం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువర్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు, కౌన్సిలర్ కేత లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
రోగులకు సహాయకులకు అన్నదానం చేయడం దైవ సేవతో సమానం
- Advertisement -
RELATED ARTICLES


