విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: యోగాసనాలు.. మానసిక రుగ్మతులకు ఔషధం అని పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకట్ కృష్ణ కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాలలో ఆరవ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ యోగాసనా చాంపియన్‌షిప్ 2025–26 ను రాష్ట్ర అధ్యక్షులు రాధిక జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, కళాశాల చైర్మన్ ప్రారంభించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ..మన యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలంటే యోగాసనం మహత్తరమైన మార్గం. శారీరక ఆరోగ్యంతో పాటు, దృఢ సంకల్పం, ఏకాగ్రత, శాంత మనసును యోగ ఇస్తుందన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమం కళాశాలలో చేపట్టడం అదృష్టం. యోగాతో పెరుగుతున్న రాష్ట్ర యువతకు ఇది గొప్ప వేదిక” అని తెలిపారు.రాష్ట్ర అధ్యక్షులు రాధిక ..ఏపీలో యోగాసన క్రీడను గ్రామ గ్రామానికీ చేర్చడమే మా లక్ష్యం. చిన్నారి విద్యార్థుల్లోనే ఆరోగ్యపు అలవాట్లు పెంపొందించాలంటే ఇలాంటి సబ్ జూనియర్ పోటీలు ఎంతో అవసరం. యోగాసనం కేవలం కళ మాత్రమే కాదు—ఇది అంతర్జాతీయస్థాయిలో భవిష్యత్తు ఉన్న స్పోర్ట్. సరైన ప్రోత్సాహం లభిస్తే మన రాష్ట్ర పిల్లలు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్స్ వేదికపై కూడా మెరిసే అవకాశం ఉంది” అని తెలిపారు .జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి .. జీవన విధానం. ఒత్తిడిని తగ్గించే శక్తి, చదువుపై ఏకాగ్రత, ఆరోగ్య పరిరక్షణ, క్రీడా స్పూర్తి ను వివరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, శాప్ అబ్జర్వర్ నాగేంద్ర , తేజ ఇనిస్టిట్యూట్ , ఎంజి. మొబైల్స్ డైరెక్టర్ డాక్టర్ సోమనాథ ,యోగాసన భారత్ అబ్జర్వర్ నంద కృపాకర్ ,జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ మారుతీ ప్రసాద్ , విద్యార్థులు పాల్గొన్నారు.


