Sunday, March 15, 2026
Homeఆంధ్రప్రదేశ్పైడిమెట్ట రైతులను ఆదుకోండి

పైడిమెట్ట రైతులను ఆదుకోండి

- Advertisement -

విశాలాంధ్ర:తాళ్లపూడి

తాళ్లపూడి మండలం లోని అన్నదేవరపేట పోచవరం, గజ్జరం గ్రామాల రైతాంగానికి సాగు నీటి అవసరాలు తీర్చే పైడిమెట్ట ఎత్తి పోతల పధకం అభివృద్ధి కి తక్షణ చర్యలు తీసుకొని తాళ్లపూడి మండలం లోని నాలుగు గ్రామాల రైతులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు ను కోరి నట్లు సంబంధిత స్కీమ్ అధ్యక్షులు ముళ్ళపూడి రామ చంద్రం వెల్లడించారు. సుమారు 2003 లో ఏర్పాటు చేసిన ఈ ఎత్తి పోతల పధకం పంపు హౌస్ లో 750 హెచ్.పి, 11కె.వి ట్రాన్సఫార్మ్, మోటార్లు, పంపులు పాడై లక్ష్యం మేరకు సాగు నీటి సరఫరా జరగటం లేదని, ఇటీవల ట్రాన్స్ ఫార్మ్ ర్ కూడా కాలి పోయిందని

రైతుల వ్యవసాయ అవసరాలను గుర్తించి కొత్త ట్రాన్స్ ఫార్మ్ ఏర్పాటు చేసి తదుపరి పూర్తి స్థాయి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఓ వినతి పత్రాన్ని మంత్రి నిమ్మల రామా నాయుడు కు అందచేశారు. పైడిమెట్ట స్కిం అధ్యక్షులు తో పాటు సంఘ సభ్యులు గన్నిన సత్తిబాబు, మండా గోవింద్ మరియు రైతులున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు