Homeజాతీయంములాయం సింగ్ కుమారుడి అనుమానాస్పద మృతి

ములాయం సింగ్ కుమారుడి అనుమానాస్పద మృతి

- Advertisement -


లక్నో: సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) బుధవారం అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. ఉదయం అపస్మారకస్థితిలో ఉన్న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చగా… అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రతీక్ భార్య, బీజేపీ నాయకురాలు అపర్ణా యాదవ్ మధ్య విభేదాలు ఉన్నట్లు ఇదివరకే వార్తలు వచ్చాయి. ప్రతీక్ కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మృతికి గల కారణాన్ని నిర్ధరించేందుకు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ అండ్ హాస్పిటల్ వైద్యబృందం పోస్ట్‌మార్టం నిర్వహించనుంది. ఆయన శరీరంపై ఎటువంటి గాయాలు లేవని ప్రాథమికంగా తెలిసిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌కు ప్రతీక్ సవతి సోదరుడు. ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాల్లో యాదవ్ కుటుంబం కీలకంగా ఉన్నప్పటికీ…ఆయన మాత్రం దూరంగా ఉండేవారు. 2011లో ప్రతీక్-అపర్ణల వివాహం జరిగింది. అయితే ఇటీవల వీరిమధ్య విభేదాలు తలెత్తాయి. అపర్ణ వల్ల తమ కుటుంబసభ్యుల మధ్య అనుబంధాలు దెబ్బతిన్నాయంటూ భార్యపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వ్యక్తిగత స్వార్థంతో తమ కుటుంబాన్ని ఆమె ధ్వంసం చేశారంటూ జనవరిలో ఆయన చేసిన పోస్టు చర్చనీయాంశమైంది. ఈ బంధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని అనుకుంటున్నట్లు, విడాకులు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. 2017లో లఖ్‌నవూ కంటోన్మెంట్ స్థానం నుంచి సమాజ్‌వాదీ తరఫున ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అపర్ణ ఓడిపోయారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన ఆమె… ప్రస్తుతం ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. తాజాగా ప్రతీక్‌ను చేర్పించిన ఆసుపత్రి వద్ద అపర్ణ కనిపించలేదు. ఇప్ప్పుడు ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు