Homeజిల్లాలుతూర్పు గోదావరిస్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు

- Advertisement -

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ.
అనపర్తి ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ గుర్రెడ్డి

విశాలాంధ్ర – అనపర్తి:​ రాష్ట్రాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగా పౌరులందరినీ బాధ్యతాయుతమైన భాగస్వాములుగా చేసేందుకు ప్రత్యేక ప్రతిజ్ఞను రూపొందించారని అనపర్తి ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ టి రామగుర్రెడ్డి అన్నారు. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు సిబ్బందిచే స్వచ్ఛ్ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఏరియా పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ​ ప్రతి పౌరుడు తన పరిసరాల పరిశుభ్రత కోసం ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించాలని అన్నారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తూ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలిఅని తెలిపారు.బహిరంగ మలమూత్ర విసర్జనను పూర్తిగా అరికట్టేలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరియు సామాజిక మరుగుదొడ్లనే ఉపయోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు.సెప్టిక్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచడం వంటి అంశాలపై ఇతరులకు అవగాహన కల్పించి, ఆరోగ్యకరమైన వాతావరణానికి తోడ్పడాలి అని అన్నారు.స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర అనే నినాదంతో, మన రాష్ట్ర ప్రతిష్టను పెంచే దిశగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎం ఓ డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ తరుణ్ మరియు వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు