Homeజిల్లాలుఅనంతపురంబాలుడి మృతి కేసులో తండ్రి అరెస్టు

బాలుడి మృతి కేసులో తండ్రి అరెస్టు

- Advertisement -

విశాలాంధ్ర యాడికి… మండలంలోని చందన లక్ష్యం పల్లి గ్రామానికి చెందిన రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ గొడవ సమయంలో రాయి తగిలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనకు సంబంధించి ఈ అరెస్టు జరిగింది.ఈ నెల 16వ తేదీ సాయంత్రం భర్త రమేష్, భార్య మహేశ్వరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రమేష్ విసిరిన రాయి, ఆమె చంకలో ఉన్న కుమారుడు రాహుల్ తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలుడిని చికిత్స కోసం తాడిపత్రి, అనంతరం కర్నూలు ఆసుపత్రులకు తరలించారు. అయితే 18వ తేదీ తెల్లవారుజామున చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు యాడికి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం మంగళవారం సాయంత్రం నిందితుడు రమేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు