- Advertisement -
విశాలాంధ్ర – ధవళేశ్వరం : /తూర్పుగోదావరి: ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది . గురువారం ఉదయం 9 గంటలకు 12.00 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం. బ్యారేజ్ నుండి 175 గేట్లు పైకెత్తి 10.17 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్ర జలాలకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న భారీ వరద నీటితో బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.


