- Advertisement -
విశాలాంధ్ర – ధవళేశ్వరం /తూర్పుగోదావరి: ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం ఉదయం 7 గంటలకు 11.80 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం. బ్యారేజ్ నుండి 175 గేట్లు పైకెత్తి 9.88 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్ర జలాలకు విడుదల. బ్యారేజ్ వద్ద గోదావరి వరద మరింత పెరగనున్నట్లు అధికారులు వెల్లడించారు.


