విశాలాంధ్ర–దేవరపల్లి:తూ. గో.జిల్లా దేవరపల్లి మండలం సంగాయగూడెం గ్రామానికి చెందిన సామాజిక విశ్లేషకులు, మోటివేషనల్ స్పీకర్ సుంకవల్లి సత్తిరాజు కు విశ్వజనని ఫౌండేషన్ ఈ రోజు హైదరాబాద్ లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్శిటీ లో విశ్వజనని సేవారత్న మరియు స్పెషల్ జ్యూరీ అవార్డునిచ్చి ఘనంగా సత్కరించారు. పలు సామాజిక సేవా కార్యాక్రమాల్లో పాల్గొనడమే కాకుండా, విద్యార్ధులను అనేక అంశాల్లో మోటివేట్ చేయడం, ప్రతిభా పాటవ పరీక్షలను నిర్వహించి వారిలో నిద్రాణమైన ప్రతిభను వెలికి తీయడంలో సుంకవల్లి సత్తిరాజు విశేషంగా కృషి చేసారు. అన్నదాన కార్యక్రమాల ద్వారా వృద్ధులకు,అనాథలకు క్షుద్భాధను తీర్చడంలో అనిర్వచనీయమైన పాత్ర నిర్వహించారు. మారుతున్న ప్రపంచ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భావి పౌరులను చైతన్య పరచడమే కాకుండా,పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలకు అవగాహన కలిగించడంలో సత్తిరాజు చేసిన కృషి అనిర్వచనీయం. యుక్త వయసు నుండి ఇప్పటి వరకు ప్రతిఫలాపేక్ష లేకుండా అనేక పత్రికలకు వేలాది వ్యాసాలు,వందలాది కవితలను వ్రాసి పాఠక లోకాన్ని అలరించడమే కాకుండా, నిజాయితీ,విలువల పట్ల నిబద్ధత పాటించి పలువురి ప్రశంసలను పొందిన సుంకవల్లి సత్తిరాజుకు అవార్డును ప్రధానం చేయడం పట్ల పలువురు అభినందించారు. నేడు జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, సినీ,టి. వి కళాకారులు పాల్గొన్నారు
సుంకవల్లి సత్తిరాజు కు విశ్వజనని సేవారత్నఅవార్డు
- Advertisement -
RELATED ARTICLES


