విశాలాంధ్ర – సీతానగరం: ప్రతీ ఇంటి పై జెండా రెపరెపలాడాలని రఘుదేవపురం సొసైటీ చైర్మన్ కవల గంగాధరరావు అన్నారు. బుదవారం రఘుదేవపురం సొసైటీ సి ఈ ఓ ప్రసాద్ ఆధ్వర్యంలో హర్ ఘర్ కా తీరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ త్రీ సభ్య కమిటీ బాధ్యతలు చెప్పటకా ఈ ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అలాగే
ఆగస్టు 15న జరగబోయే 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఆగస్టు 2 నుంచి 15 వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతీ ఇంటి పై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి, జాతీయ స్పూర్తిని పెంపొందించి కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సొసైటీ మాజీ సి ఈ ఓ రామకృష్ణ, సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.


