లిఫ్ట్ ఇస్తామని బాధితురాలిని కారులోకి ఎక్కించుకున్న ముగ్గురు యువకులు
కారులో తిప్పుతూ ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం
హైదరాబాద్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. విదేశీ యువతిపై ముగ్గురు యువకులు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే నిన్న రాత్రి మీర్పేట్ ప్రాంతంలో జర్మనీకి చెందిన యువతి నడుచుకుంటూ వెళుతోంది. ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి ఆమెను మీర్పేట్ మందమల్లమ్మ సెంటర్ లో కారులోకి ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కారులో తిప్పుతూ ఆమెపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను అక్కడి నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లారు. జరిగిన ఘటనపై బాధితురాలు పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
హైదరాబాద్ లో దారుణం.. జర్మనీ యువతిపై సామూహిక అత్యాచారం
RELATED ARTICLES