జిల్లా కలెక్టర్ చేతన్
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రయాణికుల కు మెరుగైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యము అని జిల్లా కలెక్టర్ చేతన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ధర్మారంలోని ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. బస్టాండ్ పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సదుపాయం, ప్రయాణికులకు ఏర్పాటు చేసిన టికెట్ కౌంటర్లు, సైకిల్ స్టాండ్, మరుగుదొడ్ల నిర్వహణ తదితర ప్రాంతాలను స్వయంగా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి తగు సూచనలను ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ చేత్తోని మాట్లాడుతూ బస్టాండ్ మరింత శుభ్రంగా ఉంచాలని, ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కలిగించే విధంగా కృషి చేయాలన్నారు. అదేవిధంగా వృద్ధులు, మహిళలు, శారీరకంగా వైకల్యం ఉన్నవారికి ప్రత్యేక మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అనంతరం బస్సుల మైలేజ్ ను అడిగి తెలుసుకున్నారు. డిపో మెరుగైన నిర్వహణకై కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ మహేష్ ,తహసీల్దార్ సురేష్ బాబు డిపో ఇన్చార్జ్ సికిందర్ ,సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం..
- Advertisement -
RELATED ARTICLES


