మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; కాల్ మనీ మాఫియా కు రాజకీయ కవచం ఇచ్చినవారు ఎవరో ప్రజలకు తెలుసునని, కేతిరెడ్డి స్వార్థం వల్లే ధర్మవరం శాంతిని కోల్పోయింది అని మంత్రి నియోజకవర్గం ఇంచార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎన్డీఏ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సత్యకుమార్ పాలన అంటే అభివృద్ధి పతము అని, కేతిరెడ్డి ఆయామంటే అరాచకమని తెలిపారు. మంత్రి సత్యకుమారి నాయకత్వంలో శుద్ధి పాలన ఉంటుందని స్వార్థ రాజకీయాలకు తావు ఉండదని వారు తెలిపారు. ధర్మవరం పట్టణంలో ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్న కాల్ మనీ మాఫియాల దుర్మార్గపు చర్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు బాధితులతో కలిసి పలు కీలక అంశాలను ప్రజల ముందుకు ఉంచారు. కాల్ మనీ బాధితులకు ఎన్డీఏ కార్యాలయం ముందుకు ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఇకపై ఎవరి పైన అక్రమ వడ్డీ వసూలు పేరుతో వేధింపులు జరిగిన పిడి యాక్ట్ నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కాల్ మనీ వ్యవస్థకు ప్రధాన ప్రోత్సాహకుడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అని తెలిపారు. అందుకే కేతిరెడ్డి హయాంలో ధర్మవరం నియోజకవర్గ అక్రమాల కేంద్రంగా మారిందని వారి విమర్శించారు. అనేక అసాంఘిక కార్యకలాపాలకు ఎర్రగుంట రాజా అనే వ్యక్తి కేతిరెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. ప్రస్తుత అధికార యంత్రాంగం ఈ మాఫియాలతో సంబంధాలను తెచ్చుకొని ధర్మవరం ప్రజల న్యాయానికి పునాదులు వేయాలని వారు సూచించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన స్వగృహములో పేకాట శిబిరాన్ని నడుపుతూ ఎంతోమంది చేనేత రంగానికి చెందిన ప్రముఖులను మోసం చేశాడని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తమ్ముడు వెంకటకృష్ణారెడ్డి ద్వారా గెస్ట్ హౌస్లలో అనుచిత కార్యకలాపాలు జరపాలని వారు ఆరోపించారు. అక్రమ మార్గాలలో సంపాదించిన డబ్బును అనుచరుల ఖాతాలకు బదిలీ చేయడం, అధికారులపై దౌర్జన్యాలు చేయడం సామాజిక చట్టాలను ఉల్లంఘించడం జరిగిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వారి అనుచరులు తిరిగి నియోజకవర్గాన్ని మళ్లీ చీకటి దశలోకే నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వారి స్పష్టం చేశారు. ఇకపై ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా బిజెపి గట్టిగా దెబ్బతీస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఓబులేసు, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, రూరల్ మండల అధ్యక్షుడు గుట్లూరు చంద్ర, బిజెపి మైనారిటీ నాయకులు నబి రసూల్, శంకర్, చంద్రమౌళి, గంగాధర్, జుటూరి వెంకటేష్ బండ్లపల్లి రాజు మహిళా నాయకురాలు వరలక్ష్మి, నవరత్నమ్మ, విజయలక్ష్మి ,తదితరులు పాల్గొన్నారు.
కాల్ మనీ మాఫియాకు రాజకీయ కవచం ఇచ్చినవారు ఎవరో ప్రజలకు తెలుసు…
- Advertisement -
RELATED ARTICLES


