Homeఅంతర్జాతీయంరెక్కాడితేకాని  డొక్కాడని జీవితాలపై మొంథా తుఫాన్ ప్రభావం

రెక్కాడితేకాని  డొక్కాడని జీవితాలపై మొంథా తుఫాన్ ప్రభావం

- Advertisement -

 విశాలాంధ్ర – తాళ్లపూడి : మొంథా తుపాన్ ప్రభావం తో కూలి నాలి చేసుకుని జీవించే వారంతా మూడు రోజులు పాటు   ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుఫాన్ కారణంగా ఎవర్ని బయట తిరగవద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించింది నేపధ్యం. తీవ్ర మైన గాలులు వర్షం కారణంగా ఎవరు బయటకు రాలేని పరిస్థితి. ముఖ్యన్గా కూలి పను లకు వెళ్లే వారంతా ఇంటి పట్టునే వున్నారు. వాళ్లలో ఇసుక రాంప్ లో పని చేసుకునే ప్రక్కిలంక వాసులు కూడా వున్నారు. తుఫాను భాదితులకు పునరావాసాలు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లే కనీసం తమకు ఏ సహకారం అయినా చేయాలని వాపోతున్నారు. కనీసం ఉపాధిహామీ కూలిలకిచ్చే రోజు కూలీ అయినా ఇవ్వాలి, లేదా అందరికీ పునరావాస కేంద్రాల్లోనో లేదా అన్నా క్యాంటీన్ల ద్వారా ఉచిత భోజనం అందజేయాలని పలువురు కోరుతున్నారు. తుఫాను ప్రభావం తో ఈ మూడు రోజులు కూలికి వెళ్లక  ఇల్లు గడవని వారి  పరిస్థితిని అధికారులు, పాలకులు దృష్టిలో పెట్టుకోవాలని  నిత్యావసరాలు అందజేయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు