Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రామాల ప్రజలు చట్టపరిధిలోనే జీవించాలి..

గ్రామాల ప్రజలు చట్టపరిధిలోనే జీవించాలి..

- Advertisement -

రూరల్ ఎస్సై శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గ్రామాలలో నివసించే ప్రజలు చట్టపరిధిలోనే జీవించాలని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రేగాటిపల్లి సుబ్బారావు పేట, తుమ్మల గ్రామాలలో గ్రామసభను ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ఐక్యమత్యంతో ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు. విగ్రహ మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులకు వెంటనే సమాచారాన్ని ఇవ్వాలని వారు తెలిపారు. సచివాలయ మహిళా పోలీసులు ప్రతి గ్రామములో వినాయక చవితి పండుగ సజావుగా జరిగేటట్లు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సమాచారాన్ని రూరల్ పోలీస్ స్టేషన్కు అందించాలని తెలిపారు. నిమజ్జనం చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు