ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం; డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువును ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు సెప్టెంబరు 1 వరకు గడువు పొడిగించడం జరిగిందని ప్రభుత్వ కే హెచ్. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల అభ్యర్థన మేరకు గడువును ప్రభుత్వం పొడిగించింది అని తెలిపారు. కావున పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరoగాను డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ మొదటీ సంవత్సరం చేరదలచిన విద్యార్థులకు అడ్మిషన్ కౌన్సెలింగ్ను పొడిగించారని, ఈ నెల సెప్టెంబర్ 1 వ, తేదీ లోపు విద్యార్థులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవలసి వుంటుందని, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువ పత్రాల పరిశీలన సెప్టెంబర్ నెల 1 వ, తేదీ నుండి 3 వరకు నిర్వహించబడుతుంది అని తెలిపారు. కోర్సుల, కళాశాల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవడానికి 2వ తేదీ వరకు అవకాశం కలదు అని తెలిపారు. వెబ్ ఆప్షన్ మార్పు 3వ తేదీ, సీట్ల కేటాయింపు 6వ తేదీన జరుగనున్నాయి అని తెలిపారు. సెప్టెంబర్ 8వ తేదీ నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి అని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉచితంగా చేసుకోవడానికి మా కళాశాలలో అవకాశం కలదు అని,ఆసక్తి కలిగిన విద్యార్థిని, విద్యార్థులు మా కళాశాలలో సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు తెలిపారు.
కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల రిజిస్ట్రేషన్ గడువుపెంపు..
- Advertisement -
RELATED ARTICLES


