Wednesday, July 2, 2025
Homeజిల్లాలుకర్నూలుమండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ డిమాండ్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. గ్రామాలలో సమస్యలు ఉన్నా పంచాయతీ కార్యదర్శులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చాలా గ్రామాల్లో డ్రైనేజీలలో పూడికతో నిండిపోయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. తమ సమస్యలను చెప్పడానికి కార్యాలయం చుట్టూ తిరిగుతున్నా అధికారులు పట్టించుకోకుండా అక్కడ ఉన్నాము, ఇదుగో రేపు చేయిస్తామని చెపుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎంపీడీఓ స్పందించి మండలంలో ఉన్న అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు