Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగొట్లూరు గ్రామంలో మారుమోగిన 'జై శ్రీకృష్ణదేవరాయ' నినాదాలు.

గొట్లూరు గ్రామంలో మారుమోగిన ‘జై శ్రీకృష్ణదేవరాయ’ నినాదాలు.

- Advertisement -

-వందలాది బైక్‌లతో భారీ ర్యాలీ

విశాలాంధ్ర- ధర్మవరం; బలిజ కులస్తులందరూ కూడా ఐక్యమత్యంతో ఉండాలని బలిజ సంఘం సభ్యులు రిటైర్డ్ ఎస్సై శ్రీరాములు, అచ్యుత లక్ష్మన్న తెలిపారు.పట్టణం లోని మాధవ నగర్ లో గల బలిజ కళ్యాణమడపం నందు బలిజ సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎస్ఐ శ్రీరాములు, అచ్యుత లక్ష్మన్న మాట్లాడుతూ.. ధర్మవరం మండలం పరిధిలోగల గొట్లూరు గ్రామంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటుపై బలిజ కులస్తులు చర్చించామన్నారు. తమ ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణ రాయల వారి పట్ల గౌరవాన్ని చాటుతూ ధర్మవరంలోని బలిజ కళ్యాణ మండపం వద్ద నుండి శివానగర్, కేశవ నగర్, శాంతినగర్, గొట్లూరు వరకు వందలాది బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గొట్లూరు గ్రామంలోని ఆర్చ్ వద్ద నుండి గొట్లూరు గ్రామ బలిజ కులస్తులతో కలిసి ప్రారంభమైన ఈ ర్యాలీ విగ్రహం వరకు అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ ర్యాలీలో బలిజ కులస్తులు అందరూ కలిసి “జై శ్రీకృష్ణదేవరాయ.. జై జై శ్రీకృష్ణదేవరాయ” ‘ బలిజల ఐక్యత వర్ధిల్లాలి ‘ అంటూ చేసిన నినాదాలతో గొట్లూరు గ్రామం మార్మోగిపోయింది. రాయలవారి వారసత్వాన్ని గుర్తుచేస్తూ యువత పెద్ద ఎత్తున ఈ నినాదాలలో పాల్గొన్నారు. గొట్లూరు గ్రామ ఆంజనేయ స్వామిని బలిజ కుటుంబ సభ్యులందరూ కలిసి దర్శించుకుని, దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బలిజల ఐక్యతతో గొట్లూరు శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఆవిష్కరణ త్వరలోనే ప్రారంభిస్తామని, ఆ ప్రారంభోత్సవానికి అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు. తదుపరి బలిజ కులస్తులందరూ కలిసి విగ్రహం వద్దకు చేరుకుని పూలదండలు వేసి నివాళులర్పించేందుకు సిద్ధమవ్వగా, ధర్మవరం రూరల్ ఎస్సై వారితో ప్రస్తుతం అక్కడ పూలదండలు వేయడానికి అనుమతులు లేవని తెలపడంతో, చట్టాన్ని, పోలీసుల సూచనలను గౌరవిస్తూ బలిజ కులస్తులందరూ అక్కడి నుండి వెనుతిరిగారు. కులస్తులందరూ సమావేశమై శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఏర్పాటు పై భవిష్యత్ కార్యాచరణ గుర్చి చర్చించారు. ఈ కార్యక్రమంలో అచ్యుత లక్ష్మయ్య, రిటైర్డ్ ఎస్ ఐ శ్రీరాములు, కొండమీద రాయుడు, గుండ్లపల్లి ధనుంజయ్, పసుపులేటి కళ్యాణ్, పద్మరాజ, దాసరి సురేష్, పి. నాగభూషణం, భగవాన్ గొట్లూరు బలిజ సభ్యులు గుండ్లపల్లి రామ్మోహన్, చిరంజీవి, చంద్ర కాంత్, గంగాధర్, అమర, చిన్నంశెట్టి చెన్నకేశవులు బలిజ సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు