Homeజిల్లాలుఅనంతపురంనత్తనడకన ఏకీకృత కుటుంబ సర్వే

నత్తనడకన ఏకీకృత కుటుంబ సర్వే

- Advertisement -


-ప్రతి ఇంటికీ వెళ్ళని సర్వే సిబ్బంది
-కుటుంబ యజమానులను కార్యాలయాలకు పిలిపించుకుంటున్న వైనం

విశాలాంధ్ర-రాప్తాడు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ( ఏకీకృత కుటుంబ సర్వే) మండలంలో నత్తనడకన సాగుతోంది. గత ఏడాది డిసెంబరు 15 నుంచి ఈ సర్వే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కాగా రాప్తాడు మండలంలో మొత్తం14022 కుటుంబాలు ఉండగా సెంట్రల్ సర్వర్ కూడా మొరాయిస్తుండంతో ఇప్పటి వరకు కేవలం 1832 కుటుంబాలకు మాత్రమే సర్వే పూర్తయింది. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రస్తుతం ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వివరాలను సరిచూడటంతోపాటు నిర్దేశించిన 38 ప్రశ్నలను అడిగి వివరాల ద్వారా కొత్త మార్పులను అప్‌డేట్ చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాల అమలులో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. జియో ట్యాగింగ్ ఆఫీసుల్లో తీసుకుంటుండడంతో కొంతమంది సచివాలయ సిబ్బంది కుటుంబాల వద్దకు వెళ్లకుండా కుటుంబ యజమానిని కార్యాలయాల వద్దకు పిలిపించుకుని వారి వివరాలను యాప్ లో నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల జీవన ప్రమాణాలు అర్థం చేసుకుని భవిష్యత్తులో పాలనను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు మండలంలోని ప్రతి కుటుంబం యొక్క సామాజిక-ఆర్థిక స్థితిగతులను శాస్త్రీయంగా ప్రత్యేక మెుబైల్ యాప్ ద్వారా ఆధార్ ఆధారంగా గుర్తింపును నమోదు చేయాలి. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా సర్వే చేయాల్సి ఉన్నా కొందరు సచివాలయ సిబ్బంది తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

సర్వేకు కేటాయించిన ఉద్యోగి ప్రతి ఇంటికి వెళ్లాల్సిందే
ఎంపీడీఓ బి.విజయలక్ష్మి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వేలో భాగంగా కేటాయించిన ప్రతి ఉద్యోగి ప్రతి ఇంటికీ ఖచ్చితంగా వెళ్లి కుటుంబ యజమానులతో మాట్లాడి వారి వివరాలను యాప్ లో నమోదు చేయాలి. ఎవరైనా కుటుంబాల వద్దకు వెళ్లడం లేదని తమ దృష్టికి వస్తే వారి ద్వారా వివరణ కోరి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు