జేఎన్టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: వేమన (యోగి వేమన) ప్రజా కవి, సంఘసంస్కర్త అని వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. సోమవారం పరిపాలన భవనంలో యోగి వేమన జయంతి వేడుకలను పురస్కరించుకొని వేమన చిత్రపటానికి వీసీ, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య,ఓఎస్డి వీసీ ఆచార్య ఎన్. దేవన్న పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ..గొప్ప తెలుగు కవి, తత్వవేత్త, పద్యాలు సరళమైన భాషలో, నానుడికారాలతో సామాజిక, నైతిక, తాత్విక విషయాలను , విలువలను వివరిస్తున్నారు.తెలుగు భాషకు ఖండాంతర ఖ్యాతి ఆర్జించిన సుప్రసిద్ధ కవి వేమన అన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ..ఆటవెలది ఛందస్సులో ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనే మకుటంతో ఉంటాయి. వేమన, ‘ప్రజా కవి’గా, కుల వ్యవస్థ, మత ఛాందసవాదాలను విమర్శించి, మానవతా విలువలను, యోగ మార్గాన్ని బోధించారు, వేమన పద్యాలు నేటికీ తెలుగువారి జీవితంలో భాగమయ్యాయి, జీవిత సత్యాలను తెలుపుతూ సమాజ రుగ్మతలను తొలగించారు అన్నారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరెక్టర్లు వైశాలి ఘోర్పడే , కిరణ్మయి , సుబ్బా రెడ్డి , ఎస్.వి. సత్యనారాయణ , సుజాత , పద్మ సువర్ణ , శోభా బిందు , దుర్గా ప్రసాద్ , శివ కుమార్ , దిలీప్ కుమార్ , డాక్టర్ జి. మమత ,డాక్టర్ ఓం ప్రకాశ్ ,డాక్టర్ ఎం. అంకారావు , డాక్టర్ శ్రీధర్ , పైనాన్స్ ఆఫీసర్ వెంకట శివారెడ్డి , కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వసుంధర , డి ఆర్ లు, ఏ ఆర్ లు, భోధన సిబ్బంది, భోధనేతర సిబ్బంది , అవుట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నరు.


