Homeజిల్లాలుఅనంతపురంకలెక్టరేట్ లో ఉద్యోగులకు మెడికల్ క్యాంపు ఏర్పాటు

కలెక్టరేట్ లో ఉద్యోగులకు మెడికల్ క్యాంపు ఏర్పాటు

- Advertisement -


-అనంతపురం జిల్లా ఇంచార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
విశాలాంధ్ర అనంతపురం టౌన్;ఇంచార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ప్రత్యేక చొరవ తీసుకుని అనంతపురం కలెక్టరేట్ లో రెవెన్యూ , సర్వే శాఖల ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయించారు. సోమవారం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపునకు సంబంధించిన ఏర్పాట్లను ఇంచార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పర్యవేక్షించారు. శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మలోల, తదితరులు మెడికల్ చెకప్ చేయించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ మూడు రోజులపాటు కలెక్టరేట్ లో నిర్వహించే మెడికల్ క్యాంపును రెవెన్యూ, సర్వే ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. రెవెన్యూ మరియు సర్వే శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నిత్యం ఎంతో ఒత్తిడితో విధులు నిర్వహిస్తుంటారని, వారి ఆరోగ్యంను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. రెవెన్యూ మరియు సర్వే ఉద్యోగులకు ఈరోజు రక్తపరీక్షలు, అన్ని రకాల ఎకో, 3డి ఎకో, థైరాయిడ్, తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రాథమిక స్థాయిలో వచ్చే వ్యాధి నిర్దారణను స్పెషలిస్ట్ డాక్టర్లలతో చేయించడం జరుగుతుందన్నారు. ఈనెల 20, 21వ తేదీలలో కూడా నిర్వహించే మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాలన్నారు.
మెడికల్ క్యాంపులో రెవెన్యూ క్లినిక్ లకు హాజరైన దాదాపు 200 మందికి పైగా రెవెన్యూ మరియు సర్వే ఉద్యోగులు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్యాంపులో ఆర్డీఓలు, తహసీల్దార్లు, సచివాలయంలో పనిచేసే విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు, తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, కలెక్టరేట్ లో పనిచేసే ఆయా సెక్షన్ ల ఉద్యోగులు, సిబ్బంది, పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ గంగాధర్ రెడ్డి, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, కలెక్టరేట్ సెక్షన్ ల సూపరింటెండెంట్లు వసంతలత, రియాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు