Homeఆంధ్రప్రదేశ్రుణ ప్రణాళిక లక్ష్యం రూ.83,500కోట్లు

రుణ ప్రణాళిక లక్ష్యం రూ.83,500కోట్లు

- Advertisement -

  • ఔత్సాహిక రైతులకు సులభంగా రుణాలు అందించాలి
  • డీసీసీ, డీఎలఆర్‌సీ సమావేశంలో కలెక్టర్ జి. లక్ష్మీశ
    విశాలాంధ్ర`విజయవాడ: జిల్లాను సేంద్రియ వ్యవసాయ ఉత్పతులకు హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించేందుకు బ్యాంకులు కృషిచేయాలని, ఔత్సాహిక రైతులకు సులభంగా రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధ్యక్షతన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లాస్థాయి సమీక్షా కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ బ్యాంకులకు సంబంధించిన 555 బ్రాంచ్‌ల ద్వారా అందుతున్న సేవలు, వివిధ బ్యాంకింగ్ సూచికల్లో పురోగతి, వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాల సాధన తదితరాలపై చర్చించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 83,500 కోట్లు లక్ష్యం కాగా డిసెంబర్ 31 నాటికి రూ. 88,269 కోట్ల పంపిణీతో 106 శాతం మేర లక్ష్యాన్ని సాధించినట్లు ఎల్‌డీఎం వివరించారు. ప్రాధాన్య రంగంలో 79 శాతం, ప్రాధాన్యేతర రంగంలో 123 శాతం మేర చేరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవనశైలికి పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా ప్రకృతి సాగు ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువైందని భవిష్యత్తు అంతా ఆర్గానిక్ ఉత్పత్తులదేనని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 50 వేల ఎకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతోందని వచ్చే ఒకట్రెండు సంవత్సరాల్లో లక్షకు పైగా ఎకరాల్లో ఈ విధానం అమలు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్యతరంగ నాబార్డు పొటన్షియల్ లింక్డ్ రుణ ప్రణాళిక రూ. 39,038 కోట్లును ఆవిష్కరించారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ యూబీఐ రీజనల్ హెడ్ ఎంవీ తిలక్, ఆర్‌బీఐ మేనేజర్ రాజేష్ కుమార్ కుంద్, నాబార్డు డీడీఎం ప్రథ్వి, ఎల్‌డీఎం కె.ప్రియాంక, ఆర్‌సేతి డైరెక్టర్ అమరేశ్వర్‌రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు