ఈ నెల 24న అర్హులందరికీ ఇళ్లు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమం దోనేపూడి శంకర్, జి కోటేశ్వరరావు వెల్లడి
విశాలాంధ్ర`విజయవాడ: ఉగాదికి టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందజేస్తామని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించటాన్ని కమ్యూనిస్టు పార్టీ స్వాగతించింది. ఈ మేరకు సీపీఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో పార్టీ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు నేతత్వంలో సీపీఐ బందం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం జక్కపూడి, వేమవరం ప్రాంతంలో లబ్దిదారులకు అందించేందుకు సిద్ధం చేస్తున్న టిడ్కో ఇళ్లను మంగళవారం పరిశీలించింది. సీపీఐ పలుమార్లు వివిధ రూపాల్లో చేసిన పోరాటాల ఫలితంగానే పేదల సొంతింటి కల పాక్షికంగానైనా నెరవేరుతుందని పార్టీ నాయకులు ఈ సందర్భంగా వెల్లడించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ జిల్లాలో 2, 229 టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందజేయనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ ప్రకటించటాన్ని స్వాగతించారు. 7ఏళ్లుగా చకోర పక్షులులగా ఇళ్ల కోసం ఎదురు చూసిన పేదల సొంతింటి ఆశ నేరవేరుతుందన్నారు. కార్తీక మాసంలో గహప్రవేశాలు చేయిస్తామని మాట తప్పిన ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాటం చేస్తే సీపీఐ నాయకులపై కేసులు పెట్టటం జరిగిందన్నారు. టిడ్కో ఇళ్లు ఇస్తున్నా, జగనన్న పేరుతో ఇళ్లు ఇచ్చినా, పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు భూమి కేటాయించాలని క్యాబినెట్ తీర్మానం చేసినా అవన్నీ కమ్యూనిస్టుల పోరాటం వల్లనే జరిగాయని లబ్దిదారులు, ప్రజలు గుర్తించాలని కోరారు. విజయవాడ నగరంలోని నిర్మించిన ఇళ్లు కేటాయిస్తున్న ప్రభుత్వం తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేటలలో నిర్మించిన ఇళ్లు కూడా లబ్దిదారులకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిపాజిట్లు కట్టిన అర్హులైన లబ్దిదారులంరికీ ఇల్లు కేటాయించాలని కోరుతూ మార్చి 24వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పోరాటంలో ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు ఆవాసాన్ని కల్పించాలనే లక్ష్యంతో టౌన్ ఇఫ్రాటెక్చర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(టిడ్కో)ను 2015లో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అయితే లక్ష్యానికి తూట్లు పడుతున్నాయని విమర్శించారు. లబ్దిదారుల వద్ద డిపాజిట్లు కట్టించుకుని పుష్కరకాలంగా ఇళ్లు కేటాయించలేదన్నారు. టీడీపీ, వైసీపీ, కూటమి ఇలా ప్రభుత్వాలు మారాయి తప్పా పేదలకు మేలు జరగలేదన్నారు. విజయవాడ నగరంలో 11 వేల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి వారిలో 6,556 మందిని అర్హులుగా ప్రభుత్వం గురించిందన్నారు. లబ్దిదారుల నుంచి రూ.25 వేలు, రూ.50వేలు, లక్ష రూపాయలు డిపాజట్లుగా కట్టించుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కేవలం 2,229 మంది లబ్దిదారులకు మాత్రమే ఇళ్లు కేటాయిస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఇంకా మౌలిక వసతులు కల్పించలేదని దానికి ఇంకా ఎంత సమయం పడుతుందని ప్రశ్నించారు. 30శాతం మందికి ఇళ్లు ఇచ్చి 70శాతం మందికి ఇవ్వకుండా ఉండటం సరికాదన్నారు. మిగిలి 4 వేలుకు పైగా ఇళ్లు నిర్మించేందుకు ఎన్ని నిధులు కేటాయించాలరో ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిర్ణీత సమయంలో మిగిలిన వారికి కూడా ఇల్లు కేటాయించాలని కోరారు. లబ్దిదారుల నుంచి బ్యాంకు వాయిదాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయని, ప్రభుత్వం బ్యాంకు వారితో చర్చించి పేదలపై ఒత్తిడి చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ పర్యటనలో సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యదర్శివర్గ సభ్యులు బుట్టి రాయప్ప, తాడి పైడియ్య, కేవీ భాస్కరరావు, పంచదార్ల దుర్గాంబ, అప్పురబోతు రాము, కొట్టు రమణరావు, సీపీఐ విజయవాడ రూరల్ మండల కార్యదర్శి ఉప్పె నరసింహారావు, పార్టీ నాయకులు ఆర్.పిచ్చయ్య, తెడ్డు వెంకటేశ్వరరావు, ఎస్‌కే నజీర్, తూనం వీరయ్య, బెవర శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ పోరాటాల ఫలితమే లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు
- Advertisement -
RELATED ARTICLES


