రైతుల డిమాండ్లపై కేంద్రం చర్చలు జరపాలి…
ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సి. మల్లికార్జున డిమాండ్
అనంతపురం : రైతులకు నష్టం కలిగించే మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీ రైతుల డిమాండ్లపై తక్షణమే కేంద్రం చర్చలు జరపాలని రైతుల డిమాండ్లపై కేంద్రం చర్చలు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి చిరుతల మల్లికార్జున డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆంద్రప్రదేశ్ రైతు సంఘాలు కార్మిక సంఘాల అనంతపురముజిల్లా సమన్వయ సమితి అద్వర్యంలో ఆదివారం పోలీస్ కాంప్లెక్స్ నుండీ జిల్లాకలెక్టర్ కార్యాలయము వరకు బైక్ ర్యాలీలో ఏపిరైతుసంఘము రాష్టకార్యదర్శి చిరుతల మల్లికార్జున, సిఐటియు రాష్టనాయకులు ఓబులు, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు డి చిన్నప్ప యాదవ్ ,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్, రైతు కూలి సంఘం జిల్లా నాయకులు కిష్టా, రైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి మల్లికార్జున, ఓబులు మాట్లాడుతూ… రైతులకు నష్టం కలిగించే మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చి పార్లమెంటుసాక్షిగా చెప్పిన మాట ప్రకారం గా మూడు నల్లవ్యవసాయ చట్టాలను రద్దు చేయలేదన్నారు. రైతులు పండించిన పంటలకు స్వామినాధన్ కమిటీ సిఫారసులుపార్లమెంట్ లో చట్టబద్దత కల్పించాలన్నారు. రైతులకునష్టముకల్గించే నూతన పారిశ్రామిక వ్యవసాయ మార్కెట్ విధానాలను రద్దు చేయాలన్నారు. కార్మికులు కాలరాసే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి, కష్టజీవుల కనీసం వేతనం నెలకి రూ 26 వేలు వేతనాన్ని అందించాలన్నారు. రైల్వే ప్రేవేటికరణ అరాయితీలు పునరుద్ధరించాలి, ప్యాసింజర్ రైలు పునరుద్ధరించాలి, ధరలు నియంత్రించి ఆహారము, మందులు, వ్యవసాయ ఉపకరణాలపై జీఎస్టీ ని రద్దు చేయాలని పెట్రోల్, డీజిల్ వంట గ్యాస్ పై ఎక్సైజ్ పన్నులు తగ్గించాలన్నారు. అనంతపురం జిల్లాకు సరిపడి నికర జలాలను కేటాయించి శాశ్వత కరువు నివారణ చేపట్టాలి హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు ఆపాలన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ఢిల్లీ రైతు ఉద్యమంలో మరణించి 750 మంది రైతు కుటుంబాల కు పరిహారం ఇవ్వాలి ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. రైతుల డిమాండ్లపై తక్షణమే కేంద్రము చర్చలకు పిలవాలని జగ్జి త్ సింగ్ దల్లేవాలా అమరణ దీక్షను 60 రోజుల నుండి చేస్తున్న మోడీ ప్రభుత్వం అపాలని ప్రయత్నించకపోవడం చాలా దుర్మార్గపు చర్య అన్నారు. సుప్రీంకోర్టు కూడా రైతుల డిమాండ్లపై తక్షణమే చర్చలు జరపాలని సూచించినా పెడచెవిన పెట్టడం మోడీ ప్రభుత్వం రైతులపై దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదన్నారు. మోడీ ప్రభుత్వం అనేక రైతుల డిమాండ్లపై చర్చలు జరిపి సానుకూలంగా స్పందించి తక్షణమే జాతీయ రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల ఆమరణ దీక్షను ఆపి అయన ప్రాణాలను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్మిక సంఘాల సమన్వయసమితి బైక్ ర్యాలీ ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ రైతు కార్మిక సంఘాల సమన్వయ జిల్లా సమితి నాయకులు పి.రామక్రిష్ణ, చిరంజీవి, కృష్ణుడు, నీల్లపాల రామకృష్ణ ,శివారెడ్డి ,రాయుడు వెంకట నారాయణ ,మధు యాదవ్, లలితమ్మ, రాము,రామాంజినేయులు, రాజు, చంద్రశేఖర్, వెంకటరాముడు, సంజీవ రాయుడు,కుళ్ళాయప్ప, తదితరులు పాల్గొన్నారు.